భర్త చనిపోయినా ఈ భారతీయ మహిళలు విధవలు కారు.. ఎందుకో తెలుసా?
feature Jun 13 2026
Author: Arun Kumar P Image Credits:Pinterest
Telugu
గోండ్ ఆదివాసీల వింత సంప్రదాయం
మధ్యప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో గోండ్ ఆదివాసీ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెగలో మహిళలు ఎప్పటికీ విధవలుగా మారరు.
Image credits: pixabay
Telugu
భర్త చనిపోయినా ముత్తైదువులే
ఈ తెగలో భర్త చనిపోయినా మహిళలు ముత్తైదువులుగానే ఉంటారు. భర్త చిన్న వయసులో చనిపోయినా, లేదా వృద్ధాప్యంలో మరణించినా.. వీరు మాత్రం విధవలుగా మారరు.
Image credits: AI Meta
Telugu
భర్త చనిపోయిన 10వ రోజే మరో పెళ్లి
ఈ తెగలో ఎవరైనా మహిళ భర్త చనిపోతే, 10వ రోజు ఆమెకు మరో పెళ్లి చేస్తారు. అంటే భర్త చనిపోయాడన్న బాధను దిగమింగుకుని, మరో పెళ్లికి సిద్ధమవ్వాల్సిందే.
Image credits: Unsplash
Telugu
ఎవరితో పెళ్లి చేస్తారంటే..?
ఆ మహిళ రెండో పెళ్లిని ఇంట్లో ఉన్న మరో మగవారితో జరిపిస్తారు. వరుడు.. ఆమె బావ, మరిది లేదా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా కావచ్చు.
Image credits: Unsplash
Telugu
వితంతువులకు చోటే లేదు
ఒకవేళ ఆ ఇంట్లో ఏ మగాడూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే, 10వ రోజు ఆమెకు వెండి గాజు తొడిగిస్తారు. ఆ తర్వాత నుంచి ఆమెను ముత్తైదువుగానే పరిగణిస్తారు.
Image credits: Unsplash
Telugu
వితంతువుగా బతకడం ఓ శాపం
దేశంలోని చాలా ప్రాంతాల్లో భర్త చనిపోతే మహిళలకు విధవ అనే ముద్ర వేసి దారుణంగా చూస్తారు. వారికి మరో పెళ్లి ఉండదు, అలంకరణ చేసుకోకూడదు… ఇలాంటి ఎన్నో ఆంక్షలు విధిస్తారు.
Image credits: Unsplash
Telugu
గోండ్ తెగలో మహిళలకు గౌరవం
కానీ గోండ్ తెగలో మాత్రం మహిళలకు గౌరవం ఇస్తారు. మహిళల సామాజిక భద్రత బాధ్యతను పురుషులు తమ కర్తవ్యంగా భావిస్తారు.