Entertainment

శ్రద్ధా కపూర్ ఒక్క సినిమాకు ఇంత తీసుకుంటుందా?

శ్రద్ధా కపూర్

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రద్ధా  కపూర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా 'స్త్రీ 2' మూవీ ప్రమోషన్లతో బాగా వైరల్ అవుతోంది. 

శ్రద్ధా కపూర్

మార్చి 3, 1987న ముంబైలో శ్రద్దా కపూర్ పుట్టింది. వీళ్ల నాన్న ఫేమస్ బాలీవుడ్ నటుడు. ఆమె తల్లి శివాంగి. ఈమె కోల్హాపూర్ మరాఠీ-కొంకణి వంశానికి చెందినవారు.

శ్రద్ధా కపూర్

శ్రద్ధా ముంబైలోని జమ్నాబాయి నర్సీ స్కూల్, అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదువుకుంది. ఈమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ చదువుతుండగా బాలీవుడ్‌లో మంచి ఆఫర్ రావడంతో చదువు మానేసింది

శ్రద్ధా కపూర్

2010లో తీన్ పత్తి మూవీతో శ్రద్ధా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో 'ఆషిఖీ 2' సినిమాతో ఈమె హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది.

శ్రద్ధా కపూర్

ఈ హీరోయిన్ నికర విలువ రూ. 123 కోట్లు.ఈమె ఒక్కో సినిమాకు సుమారుగా రూ. 5 కోట్లు తీసుకుంటుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా చాలా డబ్బు సంపాదిస్తుంది.ఈమె వార్షిక ఆదాయం రూ. 6 కోట్లు.

శ్రద్ధా ఆస్తి

శ్రద్ధా కపూర్ కు ముంబైలోని జుహులో సముద్ర తీరాన ఒక బ్యూటీఫుల్ ఇల్లు ఉంది. అంతేకాదు ఈమె వ్యక్తిగత పెట్టుబడులు కూడా పెడుతుంది. 

లగ్జరీ కార్లంటే ఇష్టం

శ్రద్ధా కపూర్ దగ్గర ఆడి Q7, రేంజ్ రోవర్ ఇవోక్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్‌తో పాటుగా ఎన్నో అద్భుతమైన కార్లు ఉన్నాయి. ఈ కార్లు ఆమె విజయానికి, విలాసవంతమైన జీవనశైలికి ప్రతీక.

శ్రద్ధా కపూర్

శ్రద్ధాకు పుస్తకాలు చదవడం, తోటపని చేయడం, పెయింటింగ్ వేయడం, పాటలు పాడటమంటే చాలా ఇష్టం. మీరు గమనించారా? ఈమె తన సినిమాల్లో కూడా పాడుతుంటుంది. 

సామాజిక సేవ

శ్రద్ధా కపూర్ సమాజ సేవలో కూడా పాల్గొంటుంది. ఈమె సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఎన్నో సంస్థలకు మద్దతునిస్తుంది. 

క్యూట్ డ్రెస్ లో శ్రద్ధా.. ధర వింటే షాకవ్వాల్సిందే

నాగ చైతన్య-శోభిత ధూళిపాల నిశ్చితార్థంలో ఫ్యామిలీ ఫోటోలు చూశారా?

డార్క్ చాక్లెట్ లా ఊరిస్తున్న 'మళ్ళీ రావా' హీరోయిన్.. వెరీ హాట్

గ్రీన్ డ్రెస్ లో సీతాకోకచిలుకలా ఐశ్వర్య మీనన్.. బ్యూటీఫుల్ స్టిల్స్