50 ఏళ్ల నగ్మా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె రవి కిషన్, సౌరవ్ గంగూలీ సహా పలువురితో లవ్ లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ సంబంధాలేవీ పెళ్లి వరకు వెళ్లలేదు.
59 ఏళ్ల సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. సంగీతా బిజ్లానీ, సోమీ అలీ, కత్రినా కైఫ్, ఐశ్వర్య సహా పలువురు స్టార్లతో ప్రేమాయణం నడిపారని వార్తలు వచ్చినా అవి పెళ్లివరకు వెళ్లలేదు.
53 ఏళ్ల టబు ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నారు. ఈ స్టార్ హీరోయిన్ నాగార్జున, సంజయ్ కపూర్ సహా పలువురితో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినా పెళ్లి వరకు ముందుకు సాగలేదు.
49 ఏళ్ల సుస్మితా సేన్.. రణదీప్ హుడా, విక్రమ్ భట్ సహా పలువురు ప్రముఖులతో లవ్ స్టోరీల వార్తలు వచ్చినా పెళ్లివరకు వెళ్లలేదు. ఆమె ఒంటరిగానే ఉన్నారు
49 ఏళ్ల అమీషా పటేల్ కూడా బ్యాచిలర్ గానే ఉన్నారు. విక్రమ్ భట్‌తో సంబంధం కలిగి ఉన్నారు, కానీ తర్వాత విడిపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.
48 ఏళ్ల తుషార్ కపూర్.. కరీనా కపూర్, ఈషా దేఓల్‌లతో ప్రేమాయణం సాగించారని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
52 ఏళ్ల ఉదయ్ చోప్రా పెళ్లి చేసుకోలేదు. అతనికి నర్గీస్ ఫాఖ్రీ, తనీషా ముఖర్జీలతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ అవేవీ పెళ్లికి దారితీయలేదు.
46 ఏళ్ల షమితా శెట్టి.. రాకేష్ బాపట్, అఫ్తాబ్ శివదాసాని, హర్మన్ బవేజాలతో సంబంధాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ, ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు