అనుపమా పరమేశ్వరన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ `లాక్‌డౌన్` మూవీ డిసెంబర్ 5 న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందరి చూపు దీనిపైనే ఉంది.
`లాక్‌డౌన్` విడుదలకు ముందే మరో సర్‌ప్రైజ్ ఇస్తోంది అనుపమా పరమేశ్వరన్. ఆమె నటించిన మరో సినిమా ఓటీటీలో సందడి చేయబోతుంది. తాజాగా టీమ్ ఆ విషయాలను పంచుకుంది.
అనుపమా ప్రధాన పాత్రలో నటించిన `ది పెట్ డిటెక్టివ్` మూవీ ఈ నెల 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించగా వినాయకన్, వినయ్ ఫార్ట్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ఇతక పాత్రల్లో నటించారు.
జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. తానేంటో నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని చేయటానికి ఒప్పుకుంటాడు.
ఈ కేసుని శోధించే క్రమంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, పోలీస్ ఇన్సెపెక్టర్ కథలోకి ఎంట్రీ ఇస్తారు.
కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్ ఇవన్నీ కలిపి ది పెట్ డిటెక్టివ్ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని టీం తెలిపింది.
ప్రణీత్ విజయన్ రూపొందించిన ఈ మూవీ ఇప్పటికే మలయాళంలో థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.