Entertainment

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’లో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. తన డాన్స్ తో కట్టిపడేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఆ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణా’లోనూ ‘రా రా రక్కమ్మ’ స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపించింది. అందాలు ఆరబోసి ఊర్రూతలూగించింది. సాంగ్ తో ఆమెకూ మంచి పేరొచ్చింది. 

 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. 66  మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

తాజాగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 68వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023లో జాక్వెలిన్ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైబల్ గెటప్ లో స్టేజీపై పెర్ఫామెన్స్ కూడా ఇచ్చింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ డాన్స్ అద్బుతంగా చేస్తుందన్న విషయం తెలిసిందే.  ఈ వేడుకలోనూ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫామెన్స్ తో జాక్వెలిన్ చూపు తిప్పుకోకుండా చేసింది. అందరినీ మంత్రముగ్ధులను చేసింది. 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ముఖ్యంగా జాక్వెలిన్ గిరిజన మహిళ అవతారంలో ఆకట్టుకుంది. ఈకలు, తోలులాంటి దుస్తులు, చేతిలో పొడవాటి కర్రతో దర్శనమిచ్చింది. ట్రైబల్ లుక్ లో అదిరిపోయేలా ఫోజులిచ్చి ఆకట్టుకుంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఫిల్మ్ ఫేర్ కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను జాక్వెలిన్ అభిమానులతో పంచుకుంది. జాక్వెలిన్ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ రీసెంట్ గా ‘సెల్ఫీ’ చిత్రంలో కనిపించింది. నెక్ట్స్ సోనూసూద్ నటించిన ‘ఫతే’, ఆదిత్య దత్ డైరెక్షనల్ వస్తున్న ‘క్రాక్’ చిత్రాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. 

డోస్‌ పెంచిన కీర్తి సురేష్‌.. స్లీవ్‌లెస్‌ టాప్‌లో హాట్‌ ట్రీట్‌..

చీర కొంగు పక్కకి జరిపి అనసూయ టెంప్టింగ్ సెల్ఫీలు.. మిర్చి కన్నా ఘాటుగా

2023 త్రైమాసికంలో బ్లాక్ బాస్టర్ చిత్రాలివే..

జిగేల్‌ రాణిలా మెరిసిపోతున్న జాన్వీ.. అందం కోసం మేకప్‌ రూమ్‌లో రచ్చ