మెగాస్టార్ - మాస్ రాజా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 12న విడుదలైంది. బాబీ దర్శకుడు. శృతి హాసన్ కథానాయిక. వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ.220 కోట్లకు పైగా వసూల్ చేసింది.
వీరసింహారెడ్డి
నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతి హాసన్ కథానాయిక. గోపీచంద్ మాలినేని దర్శకుడు. రూ.134 కోట్లు కలెక్ట్ చేసింది.
వారసుడు
తమిళ స్టార్ విజయ్ దళపతి తెలుగులో నటించిన తొలిచిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్. జనవరి 11న విడుదలై రూ.310 కోట్ల మేర వసూల్ చేసింది.
బలగం
చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మార్చి3న విడుదలైంది. వేణు ఎల్దండి దర్శకుడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లు. కలెక్షన్స్ రూ.26 కోట్లు.
రైటర్ పద్మభూషణ్
యంగ్ హీరో సుహాస్ నటించిన కామెడీ డ్రామా ‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి 3న విడుదలైంది. ఈ చిత్రం కూడా హిట్ అందుకుంది. షన్ముఖ ప్రశాంత్ దర్శకుడు. టీనా శిల్పరాజ్ కథానాయిక.
సార్
తెలుగులో తమిళ స్టార్ ధనుష్ నటించిన తొలిచిత్రం ‘సార్’. ఫిబ్రవరి 17న విడుదలైంది. వెంకీ అల్లూరి దర్శకుడు. సంయుక్తా మీనన్ కథానాయిక. చిత్రం రూ.118 కోట్లు కలెక్ట్ చేసింది.
దసరా
నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’ Dasara. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.115 కోట్లు కలెక్ట్ చేసింది.