దత్తత తీసుకొని పిల్లలను పెంచుతున్న బాలీవుడ్ టీవీ, సినీ నటీమణుల గురించి తెలుసుకుందాం.
సుష్మితా సేన్ పెళ్లి చేసుకోలేదు, కానీ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని తల్లి అయ్యారు. వారికి రెనీ, అలీషా అని పేరు పెట్టారు.
సన్నీ లియోన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆమె తన కవల కుమారులతోపాటు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని తన పిల్లలతో సమానంగా పెంచుకుంటోంది.
రవీనా టాండన్ పెళ్లికి ముందే ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. రవీనా వారికి చదువు చెప్పించారు, వారి పెళ్లిళ్లు కూడా చేశారు.
టీవీ నటి మాహి విజ్ కూడా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. వారు తమ తల్లిదండ్రులతో నివసిస్తున్నారు, కానీ మాహి వారి చదువు ఖర్చులను భరిస్తున్నారు.
నీలం కొఠారి, ఆమె భర్త సమీర్ సోనీ ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమెకి ఆహానా అని పేరు పెట్టారు. సొంతకూతురిలా చూసుకుంటున్నారు.
మందిరా బేడీకి ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నారు. అయినప్పటికీ, ఆమె ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు.
సాక్షి తన్వర్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యారు. ఆమె ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమె ఆ పాపకు దిత్య అని పేరు పెట్టారు.
భర్త, కొడుకులతో నయనతార ఫ్యామిలీ టూర్ ఫోటోలు వైరల్
2025 అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా? టాలీవుడ్ నుంచి ఇద్దరు
కార్తి పుట్టినరోజు: తప్పనిసరిగా చూడాల్సిన 7 బెస్ట్ మూవీస్
షారుఖ్ కూతురు సుహానా ఖాన్ మేకప్ లేకుండా ఎలా ఉంటుందో చూశారా