2025 ఏడాదికిగానూ అత్యంత రిచ్చెస్ట్ హీరోల జాబితా విడుదలైంది. ఇందులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారో తెలుసుకుందాం.
షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం, షారుఖ్ ఆస్తుల విలువ రూ. 7500 కోట్లు.
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఆస్తుల విలువ 3572 కోట్ల రూపాయలు.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఆస్తుల విలువ 3100 కోట్ల రూపాయలు.
సల్మాన్ ఖాన్ దగ్గర 2900 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సమాచారం.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నికర ఆస్తుల విలువ 2500 కోట్ల రూపాయలు.
అమీర్ ఖాన్ కి 1862 కోట్ల రూపాయల ఆస్తులన్నాయని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ 1700 కోట్ల రూపాయలు.
ఈ జాబితాలో సైఫ్ పేరు కూడా ఉంది. ఆయన దగ్గర 1200 కోట్ల రూపాయల ఆస్తి ఉంది.
* ఈ సమాచారం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా చెప్పడమైనది. ఇదే వాస్తవమని ధృవీకరించడం లేదు.