Entertainment
స్టార్ హీరోయిన్ సమంత సౌత్ లో ఒక సంచలనం అనే చెప్పాలి. సమంత 13 ఏళ్ల క్రితం 'ఏమాయ చేసావే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
నాగ చైతన్య, సమంత మధ్య పరిచయం జరిగింది ఈ చిత్రంతోనే. ఏమాయ చేశావే చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో చై సామ్ స్నేహితులుగా ఆ తర్వాత ప్రేమికులుగా మారారు.
ఈ క్రమంలో సమంత నటిగా కూడా బాగా ఎదిగింది.బృందావనం, ఈగ, దూకుడు, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ లాంటి చిత్రాలు సమంతని సౌత్ లో క్రేజీ స్టార్ గా నిలబెట్టాయి.
ఇక రంగస్థలం చిత్రంలో రామలక్ష్మిగా సమంత నటన నెక్స్ట్ లెవల్ అంతే. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగిటివ్ రోల్ లో నటించి దేశం మొత్తాన్ని అబ్బురపరిచింది.
అయితే 2021లో సమంత వ్యక్తిగత జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. సమంత, నాగ చైతన్య విభేదాల కారణంగా విడిపోయారు. దీనితో సమంతపై అనేక నిందలు, విమర్శలు వినిపించాయి.
వీటన్నింటిని భరిస్తూనే సమంత అవసరమైనప్పుడు ధీటుగా బదులిచ్చింది. ఇటీవల సమంత భయంకరమైన మయోసైటిస్ అనే వ్యాధిని కూడా ఎదుర్కొని కోలుకుంది. సామ్ చివరగా శాకుంతలం చిత్రంలో నటించింది.