Cricket
రాజకీయ నేత అరుణ్ జైట్లీ కుమారుడైన రోహన్ జైట్లీ.. జై షా తర్వాత బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. షా ఐసీసీ ఛైర్మన్ రేసులోకి వెళ్లడంతో బీసీసీఐ చీఫ్ రేసులోకి రోహన్ వచ్చారు.
రోహన్ జైట్లీ మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ రాజకీయ నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. బీసీసీఐ నాయకుల్లో మంచి గుర్తింపు సాధించారు.
రోహన్ జైట్లీ క్రికెట్‌తో చాలా ఏళ్లుగా క్రికెట్ తో అనుబంధం కలిగి ఉన్నారు. రెండుసార్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. క్రికెట్ లో మంచి అనుభవం కూడా ఉంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రోహన్ జైట్లీ ఆధ్వర్యంలో 5 ప్రపంచ కప్ మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించారు. అందుకే ఆయన బీసీసీఐ కార్యదర్శి రేసులో ముందంజలో ఉన్నారు.
బీసీసీఐ బోర్డులోని చాలా మంది సభ్యులు, ముఖ్యంగా ప్రస్తుత కార్యదర్శి జై షా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
జై షా ఐసీసీ ఛైర్మన్ అయిన తర్వాత రోహన్ జైట్లీకి ఈ స్థానం దక్కుతుంది. జై ఛైర్మన్ అయితే, ఐసీసీ చరిత్రలో అతి పిన్న వయస్కులైన బాస్ గా చరిత్ర సృష్టిస్తారు.