Cricket
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో మొదటి 4 స్థానాలను భారతీయ ఆటగాళ్లే ఆక్రమించారు. 1425 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు.
మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని 1040 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో రెండవ స్థానంలో ఉన్నారు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 1020 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో మూడవ స్థానంలో ఉన్నారు.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 634 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో నాల్గవ స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 480 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో ఐదవ స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 409 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో 6వ స్థానంలో ఉన్నారు.
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 375 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువతో 7వ స్థానంలో ఉన్నారు.
టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారత స్టార్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ నికర ఆస్తి విలువ 332 కోట్ల రూపాయలు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నికర ఆస్తి విలువ 320 కోట్ల రూపాయలుగా అంచనా.
పదవ స్థానంలో నిలిచిన భారత ఆటగాడు యువరాజ్ సింగ్ నికర ఆస్తి విలువ 266 కోట్ల రూపాయలుగా అంచనాలున్నాయి.