ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఈ లీగ్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు.
16వ సారి
ఐపీఎల్ లో డకౌట్ అవడం రోహిత్ కు ఇది 16వ సారి. తద్వారా దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ ల రికార్డును అధిగమించాడు.
వాళ్లకు 15
ఆర్సీబీ తరఫున ఆడుతున్న కార్తీక్, కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్, అదే జట్టు బ్యాటర్ మన్‌దీప్ సింగ్ లు ఐపీఎల్ లో 15 సార్లు డకౌట్ అయ్యారు.
వరుసగా రెండోసారి
పంజాబ్ కింగ్స్ తో ముగిసిన గత మ్యాచ్ లో డకౌట్ అయిన రోహిత్.. 15 సార్లు సున్నాకై అవటయ్యాడు. తాజాగా చెన్నైతో మ్యాచ్ లో కూడా మరోసారి సున్నా చుట్టాడు.
డక్ మ్యాన్
ఐపీఎల్ లో చెత్త రికార్డు నమోదు చేయడంతో సోషల్ మీడియాలో హిట్ మ్యాన్ దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు. అతడు హిట్‌మ్యాన్ కాదని ‘డక్ మ్యాన్’అని ట్రోలింగ్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఆందోళన
అసలే ఐసీసీ కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో రోహిత్ ఇలా వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.