Cricket
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన అభిమానులతో పాటు భారత జట్టు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.
గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్.. గడిచిన కొంతకాలంగా ఊతకర్ర సాయంతోనే నడుస్తున్న విషయం తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో పంత్ కాలికి తీవ్ర గాయం కావడంతో అతడి కుడి కాలికి శస్త్ర చికిత్స జరిగింది. యాక్సిడెంట్ తర్వాత మూడు నెలల పాటు ఇంటికే పరిమితమయ్యాడు.
కొద్దిరోజులుగా బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిటేషన్ పొందుతున్న పంత్ తన హెల్త్ గురించి కీలక అప్డేట్ అందజేశాడు.
చేతికి ఊతకర్ర లేకుండానే నడవడం స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు.
పంత్ ఎంత త్వరగా కోలుకుంటే టీమిండియాకు అంత మంచిది. ఈ ఏడాది అక్టోబర్ లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. ఈ టోర్నీ వరకు పంత్ అందుబాటులో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.