టీ20లు అంటేనే సిక్సర్ల మోత. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో సిక్సర్ల ద్వారానే టీమ్స్ భారీ పరుగులు పిండుకుంటాయి.
రసెల్ రికార్డు..
సిక్సర్లు కొట్టడంలో ఎక్స్‌పర్ట్ అయిన విండీస్ దిగ్గజం ఆండ్రీ రసెల్ టీ20లలో మరో అరుదైన ఘనత అందుకున్నాడు.
600..
ఐపీఎల్-16లో భాగంగా గురువారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ రెండు సిక్సర్లు బాదాడు. తద్వారా అతడు ఈ ఫార్మాట్ లో 600 సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్ గా నిలిచాడు.
టాప్ - 3 వాళ్లే..
పొట్టి ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో టాప్ -3లో ఉన్న బ్యాటర్లూ వెస్టిండీస్ ఆటగాళ్లే. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ మూడుస్థానాల్లో ఉన్నారు.
క్రిస్ గేల్..
క్రిస్ గేల్ ఏకంగా 1,056 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులు సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత గేల్ (357) పేరిటే ఉంది.
కీరన్ పొలార్డ్..
గేల్ తర్వాత విండీస్ కే చెందిన పొలార్డ్ 812 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ లో పొలార్డ్ 223 సిక్స్‌లు కొట్టాడు.
ఐపీఎల్‌లో..
ఐపీఎల్ లో రసెల్.. 188 సిక్సర్లు బాదాడు. ఈ లీగ్ లో రసెల్ 147 ఫోర్లు కూడా కొట్టాడు.