భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ధోనికి ఐపీఎల్‌లో ఇదే చివరి సీజనా..? గత కొంతకాలంగా దీనిపై చర్చలు సా...గుతూనే ఉన్నాయి. ఈ చర్చ నాలుగేండ్లుగా నడుస్తూనే ఉంది.
Telugu
నాలుగేండ్ల నుంచే..
ధోని టెస్టు జట్టు నుంచి తప్పుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమయ్యాక 2019 వన్డే వరల్డ్ కప్ లో ఆడాడు. సెమీస్ న్యూజిలాండ్ మీద ఆడిందే చివరి మ్యాచ్.
Telugu
2019 నుంచే మొదలు..
వరల్డ్ కప్ తర్వాత ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2019 నుంచే ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్తాడని గుసగుసలు వినిపించాయి.
Telugu
భారీ హైప్..
2019 నుంచి ప్రతీ సీజన్ లో ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనడంతో బ్రాడ్కాస్టర్లు దానికి భారీ హైప్ తీసుకువస్తున్నారు. కానీ ధోని మాత్రం వీటిని ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తున్నాడు.
Telugu
2019లో..
ఈ సీజన్‌లో కామెంటేటర్ ‘వచ్చే సీజన్లో మిమ్మల్ని చూడొచ్చా’ అని అడగ్గా ధోని ‘హోప్‌ఫుల్లీ యెస్’ (చూడొచ్చు) అని చెప్పాడు.
Telugu
2020లో..
2020లో కూడా కామెంటేటర్ ‘ఇదే మీ చివరి సీజనా’ అని అడగ్గా ‘డెఫినెట్లీ నాట్’.. (కాదు) అని బదులిచ్చాడు.
Telugu
2021లో..
ఈ సీజన్ లో ధోని ‘స్టిల్ ఐ హావ్ నాట్ లెఫ్ట్ బియాండ్’ అని చెప్పాడు.
Telugu
2022లో..
చెన్నై చెపాక్ క్రౌడ్ కు ధన్యవాదాలు చెప్పకుండా నా కెరీర్ ను ముగించడం బాగుండదు.
Telugu
2023లో..
‘నా లాస్ట్ సీజన్ అని నేను చెప్పలేదు. అది మీరే డిసైడ్ చేసుకుంటున్నారు’అని బదులిచ్చాడు.