ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో అరుదైన ఘనత సాధించింది. ఒకే సీజన్ లో వరుసగా రెండుసార్లు 200 ప్లస్ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఛేదించింది.
రెండు సార్లు..
ఈ సీజన్ లో ముంబై.. పంజాబ్ తో మ్యాచ్ కంటే ముందు వాంఖెడేలో రాజస్తాన్ పై 214 పరుగుల టార్గెట్ ను 19.3 ఓవర్లలో ఛేదించింది.
పంజాబ్‌తో..
పంజాబ్ కింగ్స్ తో మొహాలీలో 215 పరుగుల టార్గెట్ ను కూడా మరో ఏడు బంతులు మిగిలుండగానే అందుకుని వరుసగా రెండుసార్లు 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన తొలి టీమ్ గా రికార్డులకెక్కింది.
మూడోసారి..
ఐపీఎల్ లో 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం ముంబైకి ఇది మూడోసారి. 2021లో చెన్నైతో మ్యాచ్ లో 219 టార్గెట్ ను ఆఖరి బంతికి ఛేదించింది. తద్వారా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
ఆ రికార్డు పంజాబ్‌దే..
ఐపీఎల్‌లో రెండు వందలకు పైగా లక్ష్యాన్ని ఐదు సార్లు ఛేదించిన టీమ్‌గా పంజాబ్ కింగ్స్ ఉంది. 2014 లో రెండుసార్లు, 2010, 2022 లలో ఒకసారి 2023లో రెండు వందల టార్గెట్ ను ఛేదించింది.
జాబితాలో మరికొన్ని..
పంజాబ్ తర్వాత ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా మూడుసార్లు డబుల్ హండ్రెట్ టార్గెట్ ఛేదించాయి.