Cricket
ఐపీఎల్‌లో మరో డబుల్ సెంచరీ స్కోరు నమోదైంది. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు 200 పరుగులు సాధించారు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్‌లో సీఎస్కే తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.
ఈ లీగ్‌లో ద్విశతకం స్కోరు చేయడం చెన్నైకి ఇది 27వ సారి. ఇందులో చెన్నై ఏకంగా 20 మ్యాచ్ లలో గెలిచింది.
ఈ జాబితాలో చెన్నై తర్వాత ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు 24 సార్లు డబుల్ సెంచరీ స్కోర్లు చేసింది. కానీ 15 మ్యాచ్‌లలోనే గెలిచింది.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200+ స్కోరు చేసిన జట్లలో చెన్నై, ఆర్సీబీ తర్వాత కేకేఆర్ (18), పంజాబ్ (19), ముంబై (17), రాజస్తాన్ (16), సన్ రైజర్స్ (13) ఉన్నాయి.