Cricket

Rohit Sharma

భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ  నేడు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. 

హిట్‌మ్యాన్ :

2007లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ను అభిమానులు హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. 

రోహిత్ రికార్డులు :

రోహిత్ తన పేరిట వందలాది రికార్డులు నమోదు చేసుకున్నా ఇవి మాత్రం  చాలా ప్రత్యేకం. 
 

వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు :

అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్. 

ఒక వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు :

2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. సచిన్ తన కెరీర్ మొత్తంలో ఆరు వరల్డ్ కప్‌లు ఆడి ఆరు సెంచరీలే చేశాడు. టీ20 క్రికెట్ లో నాలుగు సెంచరీలున్నాయి.

అత్యధిక సిక్సర్లు :

వన్డేలలో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత  హిట్‌మ్యాన్‌దే. అతడి ఖాతాలో 275 సిక్స్‌లున్నాయి.టీ20లలో  రోహిత్ ఖాతాలో 182 సిక్సర్లున్నాయి. 

ఐపీఎల్ ట్రోఫీలు:

ఐపీఎల్ లో ఆరు ట్రోఫీలు గెలిచిన ఏకైక ఆటగాడు. కెప్టెన్ గా ముంబైకి ఐదు, ఆటగాడిగా డెక్కన్ ఛార్జర్స్‌ టీమ్ లో ఉండగా ఒకటి గెలిచాడు. 

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు :

ఐపీఎల్ లో రోహిత్ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (19) లు గెలుచుకున్న రికార్డు సొంతం చేసుకున్నాడు. 

IPL 2023: ఐపీఎల్‌లో భువనేశ్వర్ ఖాతాలో మరో ఘనత..

రాహుల్ త్వరగా అవుటైతేనే లక్నోకి లక్...