ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
మోస్ట్ డకౌట్స్..
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ల జాబితాలో రోహిత్.. దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ లను సమం చేశాడు.
15వ సారి..
పంజాబ్‌తో మ్యాచ్ లో డకౌట్ అవడం రోహిత్‌కు ఇది 15వ సారి. మరోసారి సున్నా చుడితే ఈ చెత్త రికార్డు అందుకున్న ఫస్ట్ బ్యాటర్ అవుతాడు.
కెప్టెన్‌గా కూడా..
బ్యాటర్‌గానే గాక కెప్టెన్ గా కూడా రోహిత్ మరో చెత్త రికార్డు నమోదుచేశాడు. సారథిగా అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో రోహిత్.. గంభీర్ రికార్డును సమం చేశాడు.
ఫైర్ బ్రాండ్‌దే..
కెప్టెన్ గా అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడు గౌతం గంభీర్. ఈ కేకేఆర్ మాజీ సారథి 10 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ రికార్డును ఇప్పుడు హిట్‌మ్యాన్ సమం చేశాడు.
డకౌట్ అయినా..
భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ డకౌట్ అయినా ముంబై మాత్రం మ్యాచ్ గెలిచింది. 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేజ్ చేసింది.