Cricket

అనుష్క బర్త్ డే :

విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి  అనుష్క శర్మ  నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటన్నది. 2008లో వచ్చిన  రబ్ నే బనాదే చిత్రంతో షారుక్ ఖాన్‌కు జోడీగా ఎంట్రీ ఇచ్చింది అనుష్క. 

స్టార్ హీరోయిన్ :

ఫస్ట్ సినిమాతోనే  మంచి క్రేజ్ దక్కించుకున్న అనుష్క ఆ తర్వాత  వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ లో  ‘ఖాన్ త్రయం’తో పాటు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది.

కోహ్లీతో పెళ్లి :

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని  ప్రేమించిన అనుష్క.. 2017లో అతడిని పెళ్లాడింది. 2021లో ఈ జంటకు వామిక పుట్టింది. ప్రస్తుతం అతడితో పాటు ఐపీఎల్‌లో అనుష్క బిజీగా గడుపుతోంది.

కోహ్లీ షాక్ :

అనుష్క బర్త్ డే సందర్భంగా కోహ్లీ తన ట్విటర్లో  ఆమె బోల్డ్ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో చూసి అందరూ షాకయ్యారు.  కోహ్లీ బర్త్ డే విషెస్ చెప్పిందానికంటే ఈ ఫోటో షేర్ చేయడం చర్చనీయాంశమైంది.

చక్డా ఎక్స్‌ప్రెస్‌తో బిజీ :

వామిక పుట్టిన తర్వాత  సినిమాలు తగ్గించిన అనుష్క  ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో ప్రముఖ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ (చక్డా ఎక్స్‌ప్రెస్) లో నటిస్తున్నది.

అతడో అద్భుతం.. నా ఫేవరేట్ క్రికెటర్ అతడే : రష్మిక మందన్న

19 మీటర్లు ఉరికి, పక్షిలా గాల్లోకి ఎగిరి... సందీప్ శర్మ సూపర్ క్యాచ్..

డబుల్ సెంచరీలు చేయడం వీళ్లకు చాలా వీజీ..

ఐదేళ్ల ముందు వార్నర్‌తో ఛాలేంజ్... చేసి చూపించిన భువీ!