Cricket

ఐపీఎల్-16:

ఐపీఎల్-16లో  హాఫ్ సీజన్ అయిపోయింది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో అన్ని టీమ్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.  

టాప్ స్కోరర్లు:

ఇప్పటివరకు   ప్రస్తుత సీజన్ లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన టాప్ స్కోరర్లు ఎవరో ఇక్కడ చూద్దాం. 

1. రుతురాజ్ గైక్వాడ్

చెన్నై బ్యాటర్  రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటాన్స్  తో మ్యాచ్‌లో 50 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. 

2. శిఖర్ ధావన్

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై  66 బంతుల్లోనే 99 పరుగులు చేశాడు. 

3. హ్యారీ బ్రూక్

సన్ రైజర్స్ ఆటగాడు  హ్యారీ బ్రూక్ కోల్కతా నైట్ రైడర్స్ పై  55 బంతుల్లో  100 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ సెంచరీ. 

4. వెంకటేశ్ అయ్యర్

కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ముంబైపై 51 బంతుల్లోనే 104 రన్స్ సాధించాడు. ఈ సీజన్ లో ఇది రెండో సెంచరీ. కేకేఆర్ చరిత్రలో కూడా రెండో శతకమే. 

5. యశస్వి జైస్వాల్

ముంబై ఇండియన్స్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 62 బంతుల్లో 124 రన్స్ సాధించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇదే టాప్ స్కోరు. ఈ సీజన్‌లో మూడో  సెంచరీ. 

Find Next One