ఐపీఎల్-16 చాలామంది స్టార్ క్రికెటర్ల మాదిరిగానే రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌కూ నిరాశను మిగిల్చింది.
Image credits: PTI
గత సీజన్‌లో..
గత సీజన్‌లో బట్లర్.. 17 మ్యాచ్ లు ఆడి 17 ఇన్నింగ్స్ లలో ఏకంగా 863 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి
Image credits: Social Media
ఈ సీజన్‌లో..
ఐపీఎల్-16 లో బట్లర్ దారుణ వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన బట్లర్.. 392 పరుగులే చేశాడు.
Image credits: PTI
డకౌట్లు..
ఈ సీజన్ కు ముందు ఆరేండ్లలో (2016 నుంచి) బట్లర్ ఒక్కసారి మాత్రమే డకౌట్ అయ్యాడు. 2023లో కూడా మొదటి మూడు మ్యాచ్ లలో బాగానే ఆడాడు.
Image credits: Social media
2023లో..
తాజా సీజన్ లో బట్లర్ ఏకంగా ఐదు సార్లు డకౌట్ అయ్యాడు. ఇందులో పది మ్యాచ్ లలోనే ఐదు డకౌట్స్ ఉండటం గమనార్హం.
Image credits: Social Media
బెంగళూరుపై రెండుసార్లు..
గుజరాత్, కోల్కతా, పంజాబ్ లపై ఒకసారి డకౌట్ అయిన బట్లర్ బెంగళూరుపై రెండు మ్యాచ్ లలో సున్నాకే వెనుదిరిగాడు.
Image credits: Social Media
ఆ పది ఇన్నింగ్స్..
ఐపీఎల్ లో గడిచిన పది ఇన్నింగ్స్ లలో బట్లర్ స్కోర్లు ఇవి : 0, 40, 0, 27, 18, 8, 95, 0, 0, 0. ఐదు సార్లు సున్నాకే వెనుదిరిగిన బట్లర్.. గత 3 మ్యాచ్ లలో హ్యాట్రిక్ డకౌట్ అయ్యాడు.