Cricket
ఐపీఎల్ లో ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ -16లో అత్యధిక సిక్సర్లు కొట్టినవారిలో రెండో స్థానంలో ఉన్న మిస్టర్ 360 (ఏబీ డివిలియర్స్) రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.
ఈ లీగ్ లో డివిలియర్స్ 184 మ్యాచ్ లు ఆడి 251 సిక్సర్లు కొట్టాడు.
తాజాగా రోహిత్.. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో భాగంగా మహ్మద్ షమీ బౌలింగ్ లో సిక్సర్ బాది 252 సిక్సర్లకు చేరుకున్నాడు.
ఈ జాబితాలో క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఐపీఎల్‌లో గేల్ 142 మ్యాచ్ లలో 357 సిక్సర్లు సాధించాడు.
గేల్, రోహిత్, డివిలియర్స్ తర్వాత ధోని.. 239 సిక్సర్లు కొట్టాడు.
ధోని తర్వాత విరాట్ కోహ్లీ.. 234 మ్యాచ్ లలో 229 సిక్సర్లు బాది ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్.. జైస్వాల్ కొత్త చరిత్ర..
వయసు మళ్లిన మన క్రికెటర్లను చూశారా..? AIతో ఏదైనా సాధ్యమే!
‘కింగ్’ ఖాతాలో మరో రికార్డు... ఐపీఎల్ 7 వేల పరుగుల క్లబ్‌లోకి...
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు.. హిట్‌మ్యాన్ కాదు ‘డక్ మ్యాన్’