Cricket
ఐపీఎల్-16 లో రాజస్తాన్ - బెంగళూరు మధ్య జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ లో రాజస్తాన్ 59 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ లో ఇది థర్డ్ లోయస్ట్ టోటల్.
ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు చేసిన రికార్డు జాబితాలో రెండో స్థానంలో కూడా రాజస్థానే ఉంది. 2009 లో ఆ జట్టు ఇదే ఆర్సీబీపై 58 పరుగులే చేసింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదుచేసిన జట్టుగా ఆర్సీబీకి రికార్డు ఉంది. 2017లో ఆ జట్టు కేకేఆర్‌తో మ్యాచ్ లో 49 పరుగులకే ఆలౌట్ అయింది.
అత్యల్ప స్కోరు సాధించిన జట్లలో టాప్ - 3లో ఆర్సీబీ, రాజస్తాన్ ఉండగా నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ లోయస్ట్ స్కోరు 66 ( ముంబైపై).
ఈ జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్ ఐదో స్థానంలో ఉంది. 2008లో కేకేఆర్.. ముంబైపై 67 పరుగులకే ఆలౌట్ అయింది.
గుజరాత్‌పై ఫస్ట్ సెంచరీ.. ముంబైకి ఐదోవది.. సూర్య రికార్డుల జాతర
మిస్టర్ 360ని దాటిన హిట్‌మ్యాన్.. ఆ జాబితాలో గేల్ తర్వాత రెండో స్థానం
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్.. జైస్వాల్ కొత్త చరిత్ర..
వయసు మళ్లిన మన క్రికెటర్లను చూశారా..? AIతో ఏదైనా సాధ్యమే!