టీమిండియా ఓపెనింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ ఐపీఎల్-16 లో నిలకడగా ఆడుతున్నాడు. హోంగ్రౌండ్ అహ్మదాబాద్ లో అయితే గిల్ దూకుడుకు అడ్డే లేకుండా పోతోంది.
Image credits: PTI
అహ్మదాబాద్‌లో..
ఈ సీజన్ లో గిల్ అహ్మదాబాద్‌లో ప్రస్తుతం హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ తో కలిపి ఏడుమ్యాచ్ లు ఆడాడు. ఏడింట్లో నాలుగు మ్యాచ్ లలో అర్థ సెంచరీలు చేశాడు.
Image credits: PTI
చెన్నైతో మొదలు..
చెన్నైతో మ్యాచ్ లో గిల్.. 36 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోల్కతాతో 31 బంతుల్లో 39 పరుగుుల సాధించాడు.
Image credits: PTI
ముంబైతో రెండో అర్థ సెంచరీ..
రాజస్తాన్ తో మ్యాచ్ లో 34 బంతుల్లోనే 45 పరుగులు చేసిన గిల్.. ముంబైతో పోరులో 34 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు.
Image credits: PTI
లక్నోపై శివతాండవం..
ఢిల్లీ తో మ్యాచ్ లో ఆరు పరుగులే చేసి విఫలమైనా తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో 51 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు.
Image credits: PTI
మరో అర్థ సెంచరీ..
సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా గిల్ మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో గిల్ 500 ప్లస్ స్కోరు చేయగా ఇందులో మెజారిటీ రన్స్ (350కి పైగా) ఇక్కడ చేసినవే కావడం గమనార్హం.