Cricket
నయా 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో విఫలమైన సూర్య.. గత ఏడు మ్యాచ్ లలో మాత్రం దుమ్ము రేపుతున్నాడు.
వాంఖెడే వేదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో సూర్యకుమార్.. 49 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ లీగ్ లో అతడికి ఇది ఫస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్ కు ముందు సూర్య హయ్యస్ట్ స్కోరు 83.
ఈ సెంచరీ చేయడం ద్వారా సూర్య తన కెరీర్ లో తొలి శతకంతో పాటు ఈ లీగ్ లో రెండో సీజన్ ఆడుతున్న గుజరాత్ పై సెంచరీ చేసిన తొలి బ్యాటర్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ పై అత్యధిక స్కోరు చేసిన ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ( 92). ఈ రికార్డును సూర్య ఇప్పుడు బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై తరఫున సెంచరీలు చేసిన బ్యాటర్లు నలుగురు (సూర్య సెంచరీకి ముందు) మాత్రమే. సూర్య ఆ జాబితాలో ఐదోవాడు.
రోహిత్ శర్మ (109*), సిమన్స్ (100*), సచిన్ (100*), జయసూర్య (114*) గతంలో ఈ ఘనత సాధించారు. యాధృశ్చికంగా వీరంతా నాటౌట్ గా నిలిచినవారే. సూర్య కూడా 103 నాటౌట్ గా ఉన్నాడు.
ఈ సీజన్‌కు ముందు సూర్య దారుణ వైఫల్యాలతో ఉన్నాడు. ఐపీఎల్-16లో కూడా ఫస్ట్ ఐదు మ్యాచ్ లలో 66 పరుగులు చేయగా తర్వా 7 మ్యాచ్ లలో 413 రన్స్ చేశాడు.
వాంఖెడే స్టేడియంలో ముంబైకి 12 ఏండ్ల తర్వాత ఇదే తొలి శతకం. చివరిసారిగా సచిన్.. 2011 లో కొచ్చిపై సెంచరీ చేశాడు.