సౌతిండియాలో తన నటనతో అలరించి బాలీవుడ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా తన ఫేవరేట్ క్రికెటర్, క్రికెట్ టీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అతడే నా ఫేవరేట్ :
తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని, అతడో అద్భుతమని రష్మిక తెలిపింది. విరాట్ ఆటతో పాటు ఆయన స్టైల్ అంటే కూడా తనకు పిచ్చి అని తెలిపింది.
ఫేవరేట్ టీమ్ :
ఐపీఎల్ లో తనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అంటే చాలా ఇష్టమని రష్మిక వెల్లడించింది.
ఈ సాలా కప్ నమ్దే :
‘నేను బెంగళూరు అమ్మాయిని. మాది కర్నాటక. ఈసాలా కప్ నమ్దే స్లోగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. ఈసారి ఆర్సీబీ ఫైనల్ వెళ్లుందని నేను భావిస్తున్నా..’ అని చెప్పింది.
ఓపెనింగ్ షో లో..
ఐపీఎల్-16 ప్రారంభ కార్యక్రమంలో భాగంగా రష్మిక మందన్న డాన్స్ తో అలరించిన విషయం తెలిసిందే.