Cricket
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. దాదాపు అన్ని జట్లు ఈ మెగా టోర్నీకి సిద్ధంగా ఉన్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ జట్లు కూడా తమ జెర్సీలను సిద్ధం చేశాయి.
టీమిండియా కోసం బీసీసీఐ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. భుజాలపై జాతీయ త్రివర్ణ పతాకంతో అద్భుతమైన కలర్ లో మెరిసిపోతోంది.
పాకిస్తాన్ కూడా తన కొత్త జట్టు జెర్సీని తీసుకువచ్చింది. PCB మునుపటితో పోలిస్తే జెర్సీలో అనేక మార్పులు చేసింది. పూర్తిగా ఆకుపచ్చ రంగు డిజైన్‌ను ఎంచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకువచ్చిన భారత జెర్సీ ధర ఐసీసీ వెబ్‌సైట్‌లో రూ. 4500గా ఉంది.
పాకిస్తాన్ కొత్త 2025 జెర్సీ ధర రూ.3500 ఉంది.