Cricket
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 8 జట్లు ఈ భారీ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. రాబోయే ఎడిషన్ లో కూడా సిక్సర్ల వర్షం ఖాయం.
13 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో 17 సిక్సర్లు కొట్టిన మాజీ భారత బ్యాట్స్‌మెన్ సౌరవ్ గంగూలీ మొదటి స్థానంలో ఉన్నారు
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 17 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో 15 సిక్సర్లు కొట్టి రెండవ స్థానంలో ఉన్నారు.
మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 13 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో 14 సిక్సర్లు కొట్టి మూడవ స్థానంలో ఉన్నారు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 17 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో 12 సిక్సర్లు కొట్టి నాల్గవ స్థానంలో ఉన్నారు.
మరో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ 11 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో 11 సిక్సర్లు కొట్టి ఐదవ స్థానంలో ఉన్నారు.