Cricket
టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాడు. దీనికి కారణం భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ మధ్య పూణేలో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్.
పూణేలో శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ టీ20 అరంగేట్రం చేసి ఇంగ్లాండ్ కీలకమైన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ పంపాడు.
హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో భారత్ ఓడిపోతున్న మ్యాచ్‌ను గెలిచింది. అయితే, ఈ రీప్లేస్‌మెంట్ నిర్ణయంపై ఇంగ్లాండ్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2025లో హర్షిత్ రానా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడనున్నాడు. మెగా వేలంలో కేకేఆర్ అతన్ని నిలుపుకుంది.
కేకేఆర్ ఫ్రాంఛైజీ హర్షిత్ రాణాను 2025 ఐపీఎల్ సీజన్ కోసం 4 కోట్ల రూపాయలకు నిలుపుకుంది. గత సీజన్‌లో అతను జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు.
హర్షిత్ రాణా 2022 నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడి 23.24 సగటుతో 25 వికెట్లు తీసుకున్నాడు.
హర్షిత్ రాణా ఐపీఎల్ 2024 సీజన్‌లో సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. హర్షిత్ 13 మ్యాచ్‌లు ఆడి 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు.