business
WhatsAppని 2009లో బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్ అనే యాహూ ఉద్యోగులు స్థాపించారు.
స్టేటస్, లొకేషన్ అప్‌డేట్ చేసి సమాచారాన్ని సులభంగా షేర్ చేసుకునే యాప్‌ను సృష్టించాలనేది వారి ఆలోచన.
ప్రకటనలు లేకపోవడం, డైరెక్ట్ ఇంటర్‌ఫేస్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రజాదరణ పొందింది. 2011 నాటికి ఇది US Apple App Storeలో టాప్ 20 యాప్‌లలో ఒకటిగా నిలిచింది.
చాటింగ్ ఫీచర్ చేర్చడం వల్ల WhatsApp ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా మారింది.
2016లో WhatsApp ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల పర్సనల్ ఇన్ఫర్ మేషన్ రహస్యంగా ఉంటుందని ప్రకటించింది.
WhatsApp ప్రారంభంలో డబ్బు పెట్టి కొనాల్సి వచ్చేది. తరువాత ఉచితం అయ్యింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది.
2014లో WhatsAppని Facebook $19 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇది ఒక ప్రధాన టెక్ కొనుగోలు అని చెప్పొచ్చు.
WhatsApp వెబ్ 2015లో ప్రారంభమైంది. డెస్క్‌టాప్ వాడకాన్ని ప్రారంభించడంతో మరింత మంది వినియోగదారులకు ఈ యాప్ చేరువైంది.
2016లో వాయిస్, వీడియో కాల్స్ ప్రవేశపెట్టారు. ఈ చర్యతో కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
మెటా 2018లో WhatsApp బిజినెస్‌ను ప్రారంభించింది. వ్యాపారాలు కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పించింది.
2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో WhatsApp ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ గా అవతరించింది.