business

బంగారు నగలు కొనేటప్పుడు మోసపోకుండా ఉండేందుకు 7 చిట్కాలు

బంగారం ఎందుకు కొనాలి?

దీపావళి ముందు ధన త్రయోదశి నాడు బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజున బంగారు దుకాణాల్లో జనాలు ఎక్కువగా ఉంటారు.

బంగారం కొనే ముందు జాగ్రత్తలు

అయితే బంగారం కొనడంలో తొందరపాటు వద్దు. ధంతేరాస్ నాడు నగలు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

24 క్యారెట్ల నగలు ఉండవు

పండగల సమయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన నగలు అమ్మకానికి పెట్టరు. 22, 20 లేదా 18 క్యారెట్ల బంగారం నగలు మాత్రమే విక్రయిస్తారు. 

బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయండి

బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) హాల్‌మార్క్‌ను తనిఖీ చేయండి. ఏప్రిల్ 1, 2023 నుండి ప్రభుత్వం బంగారు నగలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది.

నగలపై ఈ 3 గుర్తులు ఉన్నాయా?

భారత ప్రభుత్వం హాల్‌మార్క్ చేయబడిన బంగారు నగలపై మూడు గుర్తులను తప్పనిసరి చేసింది. BIS మార్క్, స్వచ్ఛత గ్రేడ్ (క్యారెట్), 6-అంకెల HUID కోడ్.

బంగారం ధరలను ముందే చెక్ చేసుకోండి

ధన త్రయోదశి నాడు బంగారు నాణేలు లేదా నగలు కొనే ముందు మీ నగరంలో బంగారం ధరలను తనిఖీ చేయండి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొద్దిగా మారుతూ ఉంటాయి.

క్యారెట్ల గురించి అవగాహన పెంచుకోండి

కొనుగోలు చేయడానికి ముందు వివిధ క్యారెట్లు, వాటికి సంబంధించిన ధరల గురించి ఆభరణాల వ్యాపారులను అడగండి. ప్రతి క్యారెట్‌కు స్వచ్ఛత, ధర గణనీయంగా మారుతూ ఉంటాయి.

తయారీ ఛార్జీల గురించి తెలుసుకోండి

ఆభరణాల వ్యాపారులు కొన్నిసార్లు తమ అభీష్టానుసారం తయారీ ఛార్జీలను జోడిస్తారు. నగలు తయారు చేయడానికి పట్టే సమయం, శ్రమ, రత్నాల నాణ్యతపై తయారీ ఛార్జీలు ఆధారపడతాయి. 

డిస్కౌంట్ గురించి వ్యాపారులను అడగండి

ఆభరణాల వ్యాపారితో తయారీ ఛార్జీలపై బేరం చేయడం ద్వారా మీరు మీ నగల ధరను గణనీయంగా తగ్గించవచ్చు. అలాగే GST గురించి ఎంక్వైరీ చేసి కొనుక్కోండి.

ధన త్రయోదశికి బంగారం, వెండి.. ఏది కొంటే మంచిది?

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఇంత తక్కువా?

వందే భారత్ స్లీపర్ కోచ్ లోపల ఎంత అందంగా ఉందో!

దీపావళికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్ ప్లాన్ ఇదిగో