business
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా 9-10-2024(బుధవారం) రాత్రి మరణించారు.
టాటా గ్రూప్‌లో ఇప్పటివరకు అత్యున్నత పదవిని కుటుంబ సభ్యులే నిర్వహించారు. ప్రస్తుతం గ్రూప్‌ను ఎన్.చంద్రశేఖరన్ నడిపిస్తున్నారు. ఆయన టాటా కుటుంబానికి చెందినవారు కాదు.
ప్రస్తుతం టాటా గ్రూప్‌లో రతన్ టాటా సోదరుడు నోయెల్ నావల్ టాటా పిల్లలు లియా, మాయ, నెవిల్‌లు కంపెనీలో పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె లియా టాటా IHCLలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ. 10 వేర్వేరు వ్యాపారాల్లో 30 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్నాయి.
టాటా కంపెనీల ప్రధాన పెట్టుబడిదారు, ప్రమోటర్ ఎవరంటే టాటా సన్స్. 66% ఈక్విటీ షేర్ క్యాపిటల్ దాతృత్వ ట్రస్టుల వద్ద ఉంది. ఇవి ఆరోగ్యం, విద్య, కళలు, సంస్కృతి రంగాల్లో పనిచేస్తాయి.
టాటా ట్రస్ట్ వద్ద 66% ఈక్విటీ షేర్ క్యాపిటల్, మిస్త్రీ కుటుంబం వద్ద 18.4%, టాటా గ్రూప్ కంపెనీ 13%, ఇతరుల వద్ద 2.6% వాటా ఉంది.
2023-24లో టాటా గ్రూప్ కంపెనీల మొత్తం ఆదాయం రూ.13.86 లక్షల కోట్లు. కంపెనీలో 10 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. టాటా టీ నుండి గడియారం, కారు, వినోద రంగం వరకు విస్తరించి ఉంది.
టాటా గ్రూప్‌లో అత్యంత విలువైన కంపెనీ TCS. దీని మార్కెట్ క్యాప్ 15.39 లక్షల కోట్ల రూపాయలు. తర్వాత స్థానంలో టాటా మోటార్స్ 3.46 లక్షల కోట్ల ఎంక్యాప్‌తో ఉంది.