business
భారతదేశంలో అనేక లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. ఇవి వాటి ధరలకు మాత్రమే కాకుండా, అద్భుతమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందాయి. ఈ కార్లు ధనవంతులకు గుర్తింపుగా కూడా మారాయి.
బ్రిటిష్ బయోలాజికల్స్ ఎండి అయిన వి.ఎస్.రెడ్డి వద్ద బెంట్లీ ముల్సాన్ EWB ఎడిషన్ ఉంది. దీని ధర దాదాపు 14 కోట్ల రూపాయలు. ఇందులో 6.75-లీటర్ V8 ఇంజిన్ ఉంది.
నీతా అంబానీ వద్ద కస్టమైజ్ రోల్స్-రాయిస్ ఫ్యాంటమ్ VIII EWB ఉంది. ధర 12 కోట్ల రూపాయలకు పైగా. దీని 6.75-లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజిన్ 571 BHP, 900 NM టార్క్‌ను అందిస్తుంది.
ముఖేష్ అంబానీ మెర్సిడెస్ S600 గార్డ్, బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ సెడాన్ ధర దాదాపు 10 కోట్ల రూపాయలు. ఇందులోని 6.0-లీటర్ V12 ఇంజిన్ 523 హార్స్‌పవర్ తో 830 NM టార్క్‌ను అందిస్తుంది.
ఇది ఇమ్రాన్ హష్మీకి చెందిన అత్యంత ఖరీదైన కారు. దాదాపు 12.25 కోట్ల రూపాయల విలువైన ఈ కారులో 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్ 592 BHP, 900 NM టార్క్‌ను అందిస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన నాసిర్ ఖాన్ మెక్‌లారెన్ 765 LT స్పైడర్‌కు యజమాని. 12 కోట్ల రూపాయల విలువైన ఈ స్పోర్ట్స్ కారులో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ఉంది.