business

RBI వడ్డీ రేట్లు తగ్గకపోయినా, ఈ ట్రిక్స్ తో మీ EMI తగ్గించుకోండి!

10వ సారి రెపో రేటులో మార్పులు లేవు

అక్టోబర్ 9న RBI గవర్నర్ శక్తికాంత దాస్ MPC సమావేశం తర్వాత మాట్లాడుతూ వరుసగా 10వ సారి రెపో రేటులో ఎటుంటి మార్పులు చేయలేదని ప్రకటించారు. 

RBI రెపో రేటు ఎందుకు తగ్గించలేదు?

గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటు మార్చకపోవడానికి కారణం ద్రవ్యోల్బణమేనని చెప్పారు. ప్రస్తుతం రెపో రేటు 6.50% వద్ద ఉంది. చివరిసారిగా ఫిబ్రవరి 2023లో రెపో రేటు మార్చారు.

రుణం EMIని ఎలా తగ్గించుకోవాలి?

రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చకపోయినా మీరు కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా మీ రుణం EMIని తగ్గించుకోవచ్చు.

EMI తగ్గించుకోవడానికి ట్రిక్-1

హోమ్, పర్సనల్ ఇలా ఏదైనా లోన్ EMI తగ్గించుకోవడానికి సులభమైన మార్గం మీ రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేయడమే. ప్రైవేట్ బ్యాంకు నుండి ప్రభుత్వ బ్యాంకుకు కూడా రుణ బదిలీ చేయవచ్చు.

EMI తగ్గించుకోవడానికి ట్రిక్-2

EMI తగ్గించుకోవడానికి దీపావళి బోనస్ లేదా ఎక్కడైనా ఒకేసారి వచ్చే డబ్బుతో రుణానికి ప్రీపేమెంట్ చేయవచ్చు. దీనివల్ల ప్రిన్సిపల్ మొత్తం తగ్గి EMI కూడా తగ్గుతుంది.

EMI తగ్గించుకోవడానికి ట్రిక్-3

EMI తగ్గించుకోవడానికి రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. రుణం 10 సంవత్సరాలైతే దాన్ని 15 సంవత్సరాలు చేయవచ్చు. అయితే దీనివల్ల చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది.

EMI తగ్గించుకోవడానికి ట్రిక్-4

స్థిర వడ్డీతో నడుస్తున్న రుణాన్ని ఫ్లోటింగ్ రేటుకు బదిలీ చేయడం ద్వారా EMI తగ్గించుకోవచ్చు. దీనివల్ల రెపో రేటు తగ్గినప్పుడు రుణంపై వడ్డీ కూడా తగ్గుతుంది.

ఈ 5 మంది భారతీయుల కార్ల ధరలు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

ఓలా బంపర్ ఆఫర్: రూ.49,999కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

ముఖేష్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఇదే..దీనికోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా

వైనైల్ కార్ ఫ్లోరింగ్‌తో ఎంత ప్రమాదమో తెలుసా