business

ఎవరు ఈ మాయా? రతన్ టాటా వారసురాలు ఈమేనా?

టాటా తదుపరి వారసులు ఎవరు?

రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ వారసత్వాన్ని అందుకోవడానికి మాయా టాటా ముందు వరసలో ఉంది. మాయా మాత్రమే ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలదనే కామెంట్స్ వినపడుతున్నాయి.

 

 

టాటా సామ్రాజ్యంలో మాయా

మాయా టాటా విద్య, అనుభవం, కుటుంబ విలువలు ఆమెను టాటా గ్రూప్‌కు నాయకత్వం వహించడానికి అర్హులుగా నిలుపుతున్నాయి. టాటా కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఆమెకు ఉంది.

ఎవరు ఈ మాయా టాటా?

మాయా టాటా, రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, ఆలూ మిస్త్రీల కుమార్తె. భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యాపార కుటుంబాలైన మిస్త్రీ, టాటా కుటుంబాలతో ఆమెకు సంబంధం ఉంది.

మిస్త్రీ కుటుంబంతో రతన్ టాటా

మాయా టాటా తల్లి ఆలూ మిస్త్రీ, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి. మాయా పెద్దమ్మ రోహికా మిస్త్రీ ₹56,000 కోట్లకు పైగా ఆస్తులతో ధనవంతురాలిగా ఉన్నారు.

మాయా టాటా విద్యార్హతలు

మాయా టాటా బేయస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్, యూకేలలో విద్యాభ్యాసం చేశారు. ఆమె విద్య ప్రపంచ వ్యాపారంపై అవగాహన, సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యాలను అందించింది.

మాయా టాటా కెరీర్

మాయా తన కెరీర్‌ను ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ నిధి అయిన టాటా ఆపర్చునిటీ ఫండ్‌లో ప్రారంభించారు. ఇక్కడ పెట్టుబడి నిర్వహణ, పెట్టుబడిదారులతో సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

డిజిటల్ రంగంలో మాయా పాత్ర

టాటా డిజిటల్‌లో మాయా కీలక పాత్ర పోషించారు. టాటా న్యూ యాప్ ప్రారంభంలో చురుగ్గా పనిచేశారు. డిజిటల్ యుగంలో కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఈ యాప్ కీలకం.

మాయా టాటా మెడికల్ ట్రస్ట్

మాయా టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు. ఈ ట్రస్ట్ కోల్‌కతాలోని ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. దీనిని 2011లో రతన్ టాటా స్థాపించారు.

ఈ ట్రిక్స్ పాటిస్తే మీ EMIలు తగ్గించుకోవచ్చు

ఈ 5 మంది భారతీయుల కార్ల ధరలు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

ఓలా బంపర్ ఆఫర్: రూ.49,999కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

ముఖేష్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఇదే..దీనికోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా