business
ప్రపంచంలోనే ఓ దేశంలో ప్రజలు అత్యధిక IQ లెవెల్స్ కలిగి ఉన్నారట. ఆ దేశం పేరేంటో మీకు తెలుసా?
ఒక వ్యక్తి ఆలోచన, విశ్లేషణ, సమస్య, పరిష్కార నైపుణ్యాలను సూచించే కొలమానమే IQ.
ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళు సాధారణంగా అమెరికా, చైనా, రష్యాలో ఉంటారని అనుకుంటున్నారు కదా.. కాని జపాన్ దేశస్థులు అత్యంత తెలివైన వాళ్లు.
జపనీయుల సగటు IQ 112.30. అందువల్ల వారు గొప్ప సమస్యలను కూడా ఈజీగా పరిష్కరించే ఆలోచనాశక్తిని కలిగి ఉన్నారు.
జపాన్ కాకుండా, హంగేరీ, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాల్లో ప్రజలు కూడా అధిక IQ స్థాయిలను కలిగి ఉన్నారు.
సమస్యలను పరిష్కరించడంలో జపనీయులు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. అందుకే టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా, చైనా కంటే జపాన్ ముందంజలో ఉంది.
తెలివితేటల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇక్కడి ప్రజలు అధిక IQని కలిగి ఉన్నారని తెలిపింది.
జపాన్ తన తెలివితేటలతో టెక్నాలజీలోనే కాదు.. చదువులో కూడా కొత్త ఆవిష్కరణలతో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది.