business
బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే మోసపోవడం ఖాయం.
బంగారం కొనే విషయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు. ముందుగా ఆ రోజు మార్కెట్ లోని బంగారం ధర కచ్చితంగా తెలుసుకోవాలి.
బంగారం ఎక్కువగా 22, 20, 18 క్యారెట్ల రూపంలో అమ్ముతారు. నగలు కొనేటప్పుడు అది ఎన్ని క్యారెట్లో కచ్చితంగా తెలుసుకోవాలి. క్యారెట్ ని బట్టి నగ ధర ఉంటుంది.
బంగారం స్వచ్ఛత కోసం BIS హాల్‌మార్క్‌ను చెక్ చేయండి. 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది.
ప్రభుత్వం హాల్‌మార్క్ నగలపై మూడింటిని తప్పనిసరి చేసింది. BIS గుర్తు, స్వచ్ఛత గ్రేడ్ (క్యారెట్), 6 అంకెల HUID కోడ్.
నగలు తయారు చేయడానికి తీసుకునే సమయం, శ్రమ, రత్నాల నాణ్యత, డిజైన్ ఆధారంగా తయారీ ఛార్జీలు మారుతుంటాయి.
నగల వ్యాపారితో మేకింగ్ ఛార్జ్ గురించి బేరం చేయడం ద్వారా, మీ నగల ధరను బాగా తగ్గించవచ్చు. GST గురించి కూడా తెలుసుకోవడం మంచిది.