business

పూజ చేసిన పువ్పులను పారేయకండి: ఇలా ఉపయోగించండి

పూజ చేసిన పువ్వులను పారేస్తున్నారా?

నవరాత్రి, దసరా పూజల తర్వాత మీ ఇంట్లో చాలా పుష్పాలు మిగిలి ఉంటాయి కదా. వాటిని పారేయకుండా అనేక విధాలుగా ఉపయోగించవచ్చు.

పాట్‌పూరీ మేకింగ్

ఎండిన పువ్వుల రేకులతో కొన్ని చుక్కల రోజ్ ఆయిల్ కలిపి పాట్‌పూరీ చేయొచ్చు. దీన్ని అలంకరణకు, సువాసన కోసం వాడుకోవచ్చు.

సాంబ్రాణి కప్పులు

ఎండిన పువ్వుల రేకులతో పేడ, కర్పూరం, నెయ్యి కలిపి సాంబ్రాణి కప్పులు చేసి మళ్లీ పూజా మందిరంలోనే వాడుకోవచ్చు.

సెంట్ తయారు చేసుకోవచ్చు

ఎండిన పువ్వులను నీటిలో మరిగించి, రంగు, సువాసన నీటిలోకి దిగిన తర్వాత దాన్ని చల్లార్చాలి. దానికి తగినంత నూనె కలిపి సువాసన స్ప్రే తయారు చేసుకోవచ్చు.

కీటకాలు నాశనం చేయొచ్చు

పూజకు వినియోగించిన పువ్వులను ఉపయోగించి కీటక నాశక స్ప్రే తయారు చేసుకోవచ్చు. నీటిలో మరిగించి వడపోసి స్ప్రే బాటిల్‌లో పోసి ఆ నీటిని వాడుకోవాలి.

మైనపువత్తుల తయారీ

మైనం కరిగించి అందులో రోజా లేదా బంతి పూల రేకులు కలిపి మైనపు వత్తులు చేసుకోవచ్చు.

సహజ రంగుల తయారీ

బంతి పువ్వులను నీటిలో మరిగించి సహజ రంగులు తయారు చేసుకోవచ్చు. రకరకాల పూల నుంచి వేర్వేరు రంగులు తయారవుతాయి. 

రంగు కాగితం

పువ్వులను కాగితం లేదా కార్డ్‌బోర్డ్‌తో కలిపి చేతితో తయారు చేసిన రంగు కాగితం తయారు చేసుకోవచ్చు.

ధూపం

ఎండిన పుష్పాలలో కర్పూరం, 1-2 ధూపం కలిపి సువాసన ఇచ్చే ధూపం తయారు చేసుకోవచ్చు.

ఆ దేశాల్లో పిల్లలను కారు ముందు సీట్లో కూర్చోపెట్టడం నేరం

మీ సెల్ ఫోన్ ఛార్జర్ శుభ్రం చేయడానికి 7 సింపుల్ టెక్నిక్స్

ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ ఈ 5 ట్రైన్ రూట్స్

టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్ నోయెల్ టాటా ఆస్తి అంత తక్కువా?