business

ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ ఈ 5 ట్రైన్ రూట్స్

ఇండియాలో బ్యూటిఫుల్ రైలు మార్గాలు

హిమాలయాల నుండి థార్ ఎడారి వరకు ట్రైన్ రూట్స్ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. డార్జిలింగ్ టాయ్ ట్రైన్ నుండి నీలగిరి కొండల వరకు ఉన్న ఈ 5 మార్గాల గురించి తెలుసుకుందాం. 

జల్పాయ్‌గురి నుండి డార్జిలింగ్

ఈ రైలు మార్గం 'టాయ్ ట్రైన్' అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశం. హిమాలయాల అందాన్ని అద్బుతంగా చూపిస్తుంది. టీ తోటలు, పర్వత శిఖరాలు, మలుపులు కనువిందు చేస్తాయి.

ముంబై నుండి గోవా

ఈ రూట్ పశ్చిమ కనుమల పచ్చని కొండలు, నదులు, బీచ్‌ల గుండా వెళుతుంది. వర్షాకాలంలో జలపాతాలు, పచ్చదనంతో ప్రయాణం మరింత అందంగా మారుతుంది.

జైసల్మేర్ నుండి జోధ్‌పూర్

జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ రైలు మార్గం థార్ ఎడారి మధ్యలో ఉన్న ఒక ప్రధాన మార్గం. దీని పొడవు దాదాపు 300 కిలోమీటర్లు. దీనిలో దిబ్బలు, పొడి మైదానాలు, ఎడారి భూభాగం కనిపిస్తాయి.

కాల్కా-షిమ్లా రైల్వే మార్గం

ఈ మార్గం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. ఈ రైలు హిమాలయ దృశ్యాలు, 102 సొరంగాలు, 864 వంతెనలు మీకు చూపిస్తుంది. ఇవి అద్భుతమైన దృశ్యాలుగా మీ మనసులో మిగిలిపోతాయి. 

మెట్టుపాలయం నుండి ఊటీ

ఇది కూడా నీలగిరి కొండల గుండా వెళ్ళే టాయ్ ట్రైన్. లోయలు, టీ తోటలు, అందమైన పచ్చని అడవులు దారి పొడవునా కనిపిస్తాయి. ఇది ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్ నోయెల్ టాటా ఆస్తి అంత తక్కువా?

చెప్పులు, షూస్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంత డేంజరో తెలుసా

iPhone 15 Pro రూ.54 వేలకే

రూ.లక్షల జీతాలొచ్చే ఉద్యోగాలు పొందాలంటే ఈ కోర్సులు చేయాలి