business
చాలా మంది ప్రజలు తమ కష్టార్జితానికి కాస్త అప్పు జోడించి మరీ కారు కొనుగోలు చేస్తుంటారు.
కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది చేసే వెంటనే వైనైల్ ఫ్లోరింగ్ లేదా పివిసి ఎంబోస్డ్ ప్యాటర్న్ ఫ్లోరింగ్ వేయిస్తుంటారు.
వైనైల్ ఫ్లోరింగ్ వల్ల మురికి, బురద, నీరు తొలగించడం సులభం. వర్షాకాలంలో తేమ ఉండదు.
అయితే ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వైనైల్ ఫ్లోరింగ్ వల్ల కొన్ని తీవ్రమైన నష్టాలు ఉన్నాయి. సాధారణ ప్రజలు వీటి గురించి ఎప్పుడూ ఆలోచించరు.
వాహనాలు సాధారణంగా ఫ్యాక్టరీ నుండి ప్లాట్‌ఫారమ్‌పై ఫెల్ట్ లైనింగ్ లేదా కార్పెట్‌తో వస్తాయి. దీని పైన ఫ్లోర్ మ్యాట్స్ వేస్తారు.
ఈ ఫ్లోర్ మ్యాట్స్‌పై దుమ్ము, మురికి పేరుకుపోతాయి. ఫ్లోర్ కార్పెట్ పని ఏమిటంటే దానిపై పడే దుమ్ము, మురికిని బంధించి చుట్టూ ఎగిరిపోకుండా నిరోధించడం.
వైనైల్ ఫ్లోరింగ్ ఈ కార్పెట్‌పై లేదా కార్పెట్‌ను తొలగించిన తర్వాత నేరుగా ప్లాట్‌ఫారమ్‌పై వేస్తారు.
అసలు కార్పెట్ దుమ్మును గ్రహిస్తుండగా వైనైల్ మ్యాట్ దానిని తిరిగి గాలిలోనే ఉంచేలా చేస్తుంది. AC ఉపయోగించినప్పుడు దుమ్ము కణాలు వాహనం లోపల, AC వెంట్స్ లోపల స్థిరపడతాయి.
ఇది వాహనం లోపలి భాగంలోని ఇతర భాగాలు మురికిగా మారడానికి కారణమవుతుంది.
వైనైల్ ఫ్లోరింగ్ ఉన్న కార్లతో తీవ్రమైన సమస్య ఏమిటంట తుప్పు. వైనైల్ అసలు కార్పెట్‌పై అతికించబడిన వాహనాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఏదైనా కారణం చేత నీరు చొరబడితే ఫెల్ట్-లైన్డ్ కార్పెట్ దానిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే పైన వైనైల్ ఉండటం వల్ల నీరు నేలకు చేరుతుంది.
ప్లాట్‌ఫారమ్‌తో నిరంతరం సంబంధం ఉండటం వల్ల పెయింట్ పెచ్చులు, తుప్పు ఏర్పడటం మొదట గుర్తించలేం.
వాహనం లోపల దుమ్ము ఎగిరినప్పుడు దానిలో నిరంతరం ప్రయాణించే వారికి తుమ్ములు, ముక్కు దిబ్బడం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి.
అసలు కార్పెట్‌తో పాటు మంచి నాణ్యత కలిగిన మ్యాట్‌లను కొనుగోలు చేయండి. ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను కొని కారు లోపలి భాగాన్ని వారానికి ఒకసారైనా పూర్తిగా శుభ్రం చేయండి.