business
OYO సహాయంతో చవకైన హోటల్ గదులు పొందడం ఇప్పుడు అందరికీ సులభం కాదు. కంపెనీ కొత్త సంవత్సరంలో తన నిబంధనల్లో మార్పులు చేసింది.
OYO కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు పెళ్లికాని జంటలకు గదులు ఇవ్వదు. మీకు పెళ్లయినట్లు ప్రూఫ్ చూపిస్తేనే రూమ్ ఇస్తారు.
ఈ రూల్ ని ప్రస్తుతం యూపీలోని మీరట్ నగరం నుండి ప్రారంభించారు. త్వరలో ఇతర నగరాల్లోనూ అమలు చేస్తారు.
నివేదికల ప్రకారం, పెళ్లికాని జంటలకు గదులు ఇవ్వకూడదని OYO నిర్ణయించింది. ఒకవేళ మీరు జంటగా వెళితే మీ మధ్య సంబంధం తెలిపే ప్రూఫ్ చూపించాలి.
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అన్ని జంటలు ఇప్పుడు చెక్-ఇన్ సమయంలో తమ మధ్య రిలేషన్ తెలిపే ధృవపత్రాన్ని చూపించాలి.
నిజానికి మీరట్ ప్రజలు, కొన్ని సామాజిక సంస్థలు పెళ్లికాని జంటలకు హోటల్‌లో గదులు ఇవ్వకూడదని కంపెనీని కోరాయి. అందుకే కంపెనీ నిబంధనల్లో మార్పులు చేసింది.
OYO వ్యాపారం భారతదేశంతో పాటు విదేశాలలో కూడా విస్తరించి ఉంది. 30కి పైగా దేశాల్లో హోటళ్లు, హోమ్ స్టే సేవలను OYO అందిస్తోంది.
OYO నెట్‌వర్క్‌లో 1.50 లక్షలకు పైగా హోటళ్లు ఉన్నాయి. కంపెనీ సేవలు అమెరికా, బ్రిటన్, జపాన్, మెక్సికో, బ్రెజిల్, నెదర్లాండ్స్ వంటి దేశాలలో కూడా అందుబాటులో ఉన్నాయి.