చలికాలం బైక్ ఆన్ అయ్యేందుకు సతాయిస్తుందా? ఇలా చేయండి..
Image credits: Freepik
ఇంజన్ ఆయిల్
బైక్‌లో ఇంజన్ ఆయిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పాత ఇంజన్ ఆయిల్‌తో సమస్యలు రావొచ్చు. అందుకే ఇంజన్ ఆయిల్‌ను మార్చాలి. నాణ్యమైన ఆయిల్‌ను మాత్రమే ఉపయోగించాలి.
Image credits: Freepik
సెల్ఫ్ స్టార్ట్ వద్దు
చలికాలంలో ఉదయాన్నే బైక్ స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ కంటే కిక్ కొట్టడమే ఉత్తమం. మరీ ముఖ్యంగా ఉదయం మొదటి సారి బైక్‌ను స్టార్ట్ చేసేప్పుడు కిక్‌నే ఉపయోగించాలి.
Image credits: Google
చౌక్‌ని ఉపయోగించాలి
బైక్ స్టార్ట్ అవ్వడంలో ఇబ్బందిగా ఉంటే చౌక్‌ని ఉపయోగించాలి. ఇలా చేస్తే ఇంజన్‌లోకి చమురు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. దీంతో బైక్ సులభంగా స్టార్ట్ అవుతుంది.
Image credits: Google
రేస్ ఇవ్వడం
చలికాలం ఉదయాన్నే బైక్ స్టార్ట్ చేయగానే వెంటనే బైక్‌ను మూవ్ చేయొద్దు. కాసేపటి వరకైనా రేస్ ఇవ్వాలి. లేదంటే బైక్ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది.
Image credits: Google
తరచూ ఆన్ చేయాలి
బైక్‌తో అవసరం లేకపోయినా తరచూ ఆన్ చేస్తుండాలి. చాలా రోజులు పాటు పక్కన పెడితే ఆన్ అయ్యే సమయంలో ఇబ్బందులు వస్తుంటాయి.
Image credits: Google
స్పార్క్ ప్లగ్
స్పార్క్ ప్లగ్‌లను శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్ వచ్చినా బైక్ త్వరగా స్టార్ట్ అవ్వదు. కాబట్టి స్పార్క్ ప్లగ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.