business

దూసుకుపోతున్న అదానీ.. డీలా పడిన అంబానీ: వారి ఆస్తిలో తేడా ఇంతే

తగ్గిన అంబానీ సంపద

అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన నికర సంపద పెరిగింది. అయితే ముఖేష్ అంబానీ సంపద తగ్గింది.

80.1 బిలియన్ డాలర్లు

గౌతమ్ అదానీ నికర సంపద 3.48 బిలియన్ డాలర్లు పెరిగి 80.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

18వ అత్యంత ధనవంతుడు

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచంలో 18వ, భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడు. ఆయన ముఖేష్ అంబానీ కంటే ఒక స్థానం మాత్రమే వెనుక ఉన్నారు.

90.6 బిలియన్ డాలర్లు

ముఖేష్ అంబానీ నికర సంపద 647 మిలియన్ డాలర్లు తగ్గి 90.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన ప్రపంచంలో 17వ స్థానంలో, భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

అదానీ కంటే కాస్త ఎక్కువ

ముఖేష్ అంబానీ నికర సంపద గౌతమ్ అదానీ కంటే 10.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ. ఈ సంవత్సరం అదానీ సంపద 4.23 బిలియన్ డాలర్లు తగ్గిన తర్వాత ఈ తేడా కనిపించింది. 

మస్క్ నెంబర్ వన్

442 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ 241 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు.

మూడో స్థానంలో జుకర్‌బర్గ్

మూడవ స్థానంలో ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్ (209 బిలియన్ డాలర్లు) ఉన్నారు. నాల్గవ స్థానంలో లారీ ఎల్లిసన్, ఐదవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు.

టాప్ 10 లిస్ట్ ఇదే..

ఆరో స్థానంలో లారీ పేజ్, ఏడవ స్థానంలో సెర్గీ బ్రిన్, ఎనిమిదవ స్థానంలో బిల్ గేట్స్, తొమ్మిదవ స్థానంలో స్టీవ్ బాల్మర్, పదవ స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు.

ఈ స్టార్స్ కొన్న కార్లు ఎన్ని రూ.కోట్లో తెలుసా?

ఇంట్లో ఉంటూనే నెలకు రూ. 15వేల ఆదాయం.. బాల్‌ పెన్‌ తయారీతో

హ్యాంగోవర్ నుండి బయటపడాలా? బెస్ట్ 7 టిప్స్ ఇవిగో

జనవరి 2025 బ్యాంక్ సెలవులు ఇవే