business

ఇది క్యాబ్ కాదు.. కొత్త మారుతి డిజైర్. లుక్ అదిరిపోయిందిగా

Image credits: CarDekho

టాక్సీ మార్కెట్‌లో అధిక డిమాండ్

ట్రావెలింగ్ కు చక్కటి సౌకర్యాలు కల్పించే మారుతి డిజైర్ కు టాక్సీ మార్కెట్‌లో అధిక డిమాండ్‌లో ఉంది.

Image credits: CarWale

అందరికీ ఇష్టమే కాని..

బడ్జెట్, మైలేజీ పరంగా మారుతి డిజైర్ అందరికీ ఇష్టమే. కాని ఫ్యామిలీ కోసం కొందామంటే అప్పటికే క్యాబ్ కారు అనే మార్క్ పడిపోయింది. 

Image credits: CarWale

కొత్త డిజైర్

మారుతి డిజైర్ ఇటీవల రూ.6.79 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. 5-స్టార్ భద్రతా రేటింగ్‌తో వచ్చిన మొదటి మారుతి కారు ఇది.

Image credits: CarWale

పెద్ద ప్రకటన

కొత్త డిజైర్ మోడల్ లిమిటెడ్ ప్రొడక్షన్ అని, ప్రజలకు మాత్రమే అమ్ముతామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టకేయుచి ప్రకటన చేశారు.

Image credits: Getty

ఫ్యామిలీస్ కోసం మాత్రమే

కొత్త మారుతి డిజైర్ ప్రైవేట్ వినియోగదారులకు, ఫ్యామిలీ పర్పస్ కోసం మాత్రమే విక్రయిస్తారు. అంటే ఈ మోడల్ కారును క్యాబ్ గా ఉపయోగించకూడదు. 

Image credits: సోషల్ మీడియా

టాక్సీలుగా డిజైర్ కార్లు

ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌లో అమ్ముడైన మారుతి డిజైర్ కార్లలో చాలా వరకు టాక్సీలుగా ఉపయోగిస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Image credits: సోషల్ మీడియా

టాక్సీ కోసం పాత మోడల్

డిజైర్ విస్తృతంగా ఫ్లీట్, టాక్సీ-కాబ్ సేవలలో ఉపయోగిస్తున్నారు. క్యాబ్ గా వినియోగించాలంటే పాత మోడల్స్ కొనుక్కోవాల్సిందే. 

Image credits: సోషల్ మీడియా

గుడ్ న్యూస్

మారుతి డిజైర్ ఇష్టపడే వారు ఈ సారి క్యాబ్‌లా కాకుండా ఇంటి అవసరాలకు కొత్త మోడల్ కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రజలకు శుభవార్తే.

Image credits: సోషల్ మీడియా

ఇంజిన్

స్విఫ్ట్ 1.2 లీటర్, 3 సిలిండర్ 'Z' సిరీస్ ఇంజిన్. ఈ ఇంజిన్ 81.58 PS శక్తిని, 111.7 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

 

Image credits: సోషల్ మీడియా

మైలేజ్

మాన్యువల్ వేరియంట్ 24.79 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ 25.71 kmpl, CNG వేరియంట్ 33.73 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Image credits: CarDekho

రోజుకు సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు వేయొచ్చో తెలుసా?

కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !

మీ డబ్బులను రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం ఇది

WhatsApp గురించి మీకు తెలియని 10 విషయాలు ఇవిగో