business

మీ డబ్బులను రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం ఇది

Image credits: social media

మీ డబ్బులు రెట్టింపు చేసుకోండి !

మీ పొదుపును రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ కోసం ఒక గొప్ప అవకాశం ఉంది. మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకునే అద్భుతమైన మార్గం కిసాన్ వికాస్ పత్ర (KVP) స్కీమ్. 

Image credits: social media

'కిసాన్ వికాస్ పత్ర పథకం' అంటే ఏమిటి?

కిసాన్ వికాస్ పత్ర అనేది ఒక ప్రభుత్వ పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తుంది.
 

Image credits: social media

ఎంతకాలంలో డబ్బు రెట్టింపు అవుతుంది?

కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు దాదాపు 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. 7.5% వార్షిక వడ్డీ రేటు అందిస్తారు. ఇది మీ డబ్బును రెట్టింపు చేస్తుంది. 

Image credits: Getty

ఈ పథకానికి ఎవరు అర్హులు?

కిసాన్ వికాస్ పత్ర పథకం ప్రయోజనం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు అర్హుడే. 

Image credits: Getty

తల్లిదండ్రులు ఖాతా తెరవవచ్చు

ఒకవేళ మైనర్ అయితే, అతని / ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. పథకం ప్రయోజనం కోసం సమీప పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించండి.

Image credits: Getty

కిసాన్ వికాస్ పత్ర ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ స్కీమ్ అప్లై కోసం ఆధార్ కార్డు-పాన్ కార్డు అవసరం. సమీప పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. మీ జాయింట్ ఖాతాతో పాటు ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రారంభించవచ్చు.

Image credits: social media

Kisan Vikas Patra ప్రయోజనాలు

మీ పెట్టుబడిపై 7.5% వార్షిక వడ్డీ. డబ్బు రెట్టింపు అయ్యే గ్యారెంటీ. తక్కువ రిస్క్, ఎక్కువ రాబడి. పోస్ట్ ఆఫీస్ అందించే పథకం కావడంతో మన డబ్బుకు గ్యారంటీ ఉంటుంది.
 

Image credits: Getty

WhatsApp గురించి మీకు తెలియని 10 విషయాలు ఇవిగో

₹10 లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే టాప్-5 డీజిల్ కార్లు

ఈ టిప్స్ పాటిస్తే మీ డ్రైవింగ్ బెటర్ గా మారుతుంది

రూ.10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ డీజిల్ కార్లు ఇవిగో