XL6 ప్రీమియం MPV 2024 మోడల్‌లపై రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 2025 మోడల్‌లపై రూ.25,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్‌లు పెట్రోల్, CNG మోడల్‌లకు అందుబాటులో ఉన్నాయి.
సియాజ్ సిగ్మా, డెల్టా 2024 మోడల్‌లపై రూ.60,000 డిస్కౌంట్, ఆల్ఫా, జీటాపై రూ.55,000. 2025 మోడల్‌లపై రూ.30,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
2024 బాలెనోపై రూ.40,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి ఇంజిన్ ఆప్షన్‌పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ కూడా అందిస్తున్నారు.
2024 ఇగ్నిస్‌పై రూ.45,000, 2025 ఇగ్నిస్‌పై రూ.20,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇతరాలు కలిపి మొత్తం రూ.77,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 2025 మోడల్‌లపై రూ.52,000 వరకు ఇస్తున్నారు.
2024 ఫ్రాంక్స్ పెట్రోల్‌పై రూ.20,000 డిస్కౌంట్, నాన్-టర్బో ఫ్రాంక్స్‌పై రూ.35,000, 2025 మోడల్‌పై రూ.15,000 మరికొన్ని డిస్కౌంట్స్ కలిపి మొత్తం రూ.93,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
2024 గ్రాండ్ విటారాపై రూ.65,000, 2025 మోడల్‌పై రూ.25,000 డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం డిస్కౌంట్ రూ.1,18,100 నుండి రూ.93,100 వరకు ఉంటుంది.
జిమ్నీ 2024, 2025 మోడల్‌లపై రూ.25,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఇన్విక్టో 2024పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇతర డిస్కౌంట్లతో కలిపి 2024 మోడల్‌పై మొత్తం డిస్కౌంట్ రూ.2.10 లక్షలు, 2025 వేరియంట్‌పై రూ.1.15 లక్షలు డిస్కౌంట్స్ లభిస్తాయి.