business
రాజస్థాన్‌లోని పుష్కర్ అంతర్జాతీయ జంతు మేళాలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక జంతువులు వచ్చాయి. అందులో ఒక గుర్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
పుష్కర్ మేళాకు వచ్చిన ఈ గుర్రం పంజాబ్‌లోని మొహాలీ నుండి వచ్చింది. దీని పేరు కర్మదేవ్. దీని ధర రూ.11 కోట్లు. అయినా యజమాని అమ్మడానికి సిద్ధంగా లేేరు.
ఈ గుర్రం ధర అక్షరాల రూ.11 కోట్లు. ఈ డబ్బుతో మీరు 20 ఆడి కార్లు లేదా 20 కంటే ఎక్కువ బిఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయవచ్చు.
కర్మదేవ్ గుర్రం దేశంలోనే అత్యంత ఎత్తైనది. దీని ఎత్తు 72 అంగుళాలు, వయస్సు 4 సంవత్సరాలు.
ఈ గుర్రం యజమాని గురు ప్రతాప్ సింగ్ దగ్గర 82 గుర్రాలు ఉన్నాయి. అందులో 30 గుర్రాలను మేళాకు తీసుకొచ్చారు. వాటిల్లో కర్మదేవ్ చాలా ప్రత్యేకం.
ఈ గుర్రం ద్వారా బ్రీడింగ్ చేస్తే యజమాని రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షలు వసూలు చేస్తారు. గుర్రం ఆహారం కోసం రోజుకు రూ.1000 ఖర్చు అవుతుంది.
ట్రంప్‌కి మంత్రిగా రామస్వామి: ఆయన ఆస్తి అన్ని వేల కోట్లా?
ఇది క్యాబ్ కాదు.. కొత్త మారుతి డిజైర్. లుక్ అదిరిపోయిందిగా
రోజుకు సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు వేయొచ్చో తెలుసా?
కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !