business
ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగుల జీతాలు పెంచేందుకు సంస్థ ఆలస్యం చేస్తోంది. ప్రస్తుతానికి జీతాల పెంపును నిలిపివేసినట్లు సమాచారం.
ఇన్ఫోసిస్ ఇటీవల జీతాల పెంపును వాయిదా వేసింది. ఇది ఇప్పటి మూడు సార్లు జరిగింది. నాలుగో త్రైమాసికంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇన్ఫోసిస్ తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం మూడు త్రై మాసికాలుగా పెంచడం లేదు. చివరి జీతం పెంపు నవంబర్ 2023లో జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా అప్‌డేట్ అవుతుండటంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. దీంతో ఖర్చు తగ్గింపులో భాగంగా జీతాల పెంపును ఇన్ఫోసిస్ వాయిదా వేస్తోంది.
వారానికి 70 గంటలు పని చేయాలని తాను కోరుకుంటున్నట్టు నారాయణ మూర్తి ప్రకటించారు. అయితే జీతాల పెంపును నిలిపివేయండంతో ఉద్యోగుల్లో అసహనం నెలకొంది.
భారతదేశం అభివృద్ధి చెందాలంటే యువత కష్టపడి పనిచేయాలని మూర్తి అన్నారు.
వారానికి 70 గంటల పని చేయాలన్న నారాయణ మూర్తి సూచనను ఎక్కువమంది వ్యతిరేకించారు. కొందరు మాత్రమే మద్దతు ఇచ్చారు.
ఇన్ఫోసిస్ రెండో త్రైమాసికంలో నికర లాభం 2.2% పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. అయితే ఇది సంస్థ అంచనాల కంటే తక్కువగా ఉంది.