తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే బిజినెస్ ఐడియా
business Oct 04 2026
Author: Haritha Chappa Image Credits:Pixabay
Telugu
మారుతున్న యువత ఆలోచనలు
ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారుతోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, తమ సొంత ఊరిలోనే చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి భారీగా లాభాలు అందుకుంటున్నారు.
Image credits: FREEPIK
Telugu
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే వ్యాపారాలపైనే అందరి దృష్టీ ఉంటోంది. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ ఒకటి.
Image credits: Getty
Telugu
ఎక్కడ మొదలుపెట్టొచ్చు?
ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు.
Image credits: Pinterest
Telugu
పెట్టుబడి ఎంత కావాలి?
ఈ వ్యాపారానికి ఒక చిన్న స్టాల్, ఫ్రెంచ్ ఫ్రైస్ మేకింగ్ మెషిన్, రెడీమేడ్ పొటాటో ఫింగర్ చిప్స్, చాట్ మసాలా, నూనె లాంటి ముడిసరుకులు అవసరం. రూ. 30 వేల పెట్టుబడి అవసరం.
Image credits: freepik
Telugu
తయారీ విధానం
మార్కెట్లో 2.5 కిలోల పొటాటో ఫింగర్ చిప్స్ ప్యాకెట్ రూ. 270 నుంచి రూ. 300 వరకు దొరుకుతుంది. ఈ రెడీమేడ్ చిప్స్‌ను నూనెలో వేయించి, మసాలా చల్లి ప్యాకింగ్ చేసి అమ్మడమే.
Image credits: freepik
Telugu
లాభాలు ఎలా ఉంటాయి?
ఒక కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి సుమారు రూ. 20 ఖర్చవుతుంది. దాన్ని రూ. 50కి అమ్మితే రూ. 30 లాభం వస్తుంది. రోజుకు 50 ప్యాకెట్లు అమ్మినా సులభంగా రూ. 1500 లాభం మీ సొంతం అవుతుంది.
Image credits: freepik
Telugu
బెస్ట్ బిజినెస్
ఈ బిజినెస్ సాయంత్రం పూట పార్ట్ టైమ్ గా కూడా చేయవచ్చు. ఉదయం పూట ఉద్యోగం చేసుకుని సాయంత్రం వీటిని అమ్మినా డబ్బులు సంపాదించవచ్చు.